SDPT: చట్ట విరుద్ధ కార్య కలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని వైన్ షాపుల లైసెన్స్ హోల్డర్స్ నుంచి కొంతమంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి పనులు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. వైన్ షాపులపై ఫిర్యాదులుంటే ఎక్సైజ్ అధికారులకు తెలపాలని కోరారు.