ADB: జిల్లాకు యాసంగి సీజన్‌కు 6,542 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఇప్పటి వరకు 4,045 మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే 8977742855 నంబర్‌కు సంప్రదించాలన్నారు.