కృష్ణా: పామర్రు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఉత్తమ కార్యకర్తలు, యూనిట్ హెడ్స్, బూత్ కన్వీనర్లకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా అవార్డులను అందజేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు కార్యకర్తలే వెన్నెముక అని, వారి సేవలను గుర్తించారు.