MDK: నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో ఆస్తి పంపకం చేయమని తండ్రి దశరథను కత్తితో పొడిచిన కొడుకు నాగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సుబవల్లి తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. నేరస్థుడికి శిక్షపడేందుకు కృషిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.