ప్రకాశం జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మంగళవారం ఒంగోలులో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు జరిగిన సమయాల్లో సీసీ ఫుటేజ్‌లు కీలకంగా మారాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో ప్రమాదాల సంఖ్య జిల్లాలో తగ్గుముఖం పట్టినట్లు పేర్కోన్నారు.