KRNL: ఆదోని పట్టణంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మను పెద్దకడబూరు మండలం నౌలేకల్ గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. యువ నాయకులు రాజు, శాంతప్ప ఆమెతో సమావేశమై మండలంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసి పార్టీని బలోపేతం చేయాలని కృష్ణమ్మ సూచించారు.