ADB: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించి వాటిని బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా సూచించారు. తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలదదేవీ, టీఎస్పీటీఏ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రియాజ్, తదితరులు ఉన్నారు.