NLR: జిల్లా వాసుల చిరకాల కోరిక దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. విమానాశ్రయం భూసేకరణకు సంబంధించిన సమగ్ర నివేదికను కలెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. సోమవారం అమరావతిలో ఈ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. దీంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.