GDWL: ప్రజావాణిలో వెలువడిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలన్నారు.