కృష్ణా: పెనమలూరు గ్రామంలో రూ.70లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంకర్ను ఎమ్మెల్యే ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18నెలల కాలంలో కోట్లాది రూపాయల అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. అమరావతి నిర్మాణం ద్వారా రాబోయే రోజుల్లో పారిశ్రామిక సాంకేతిక అభివృద్ధితో పాటు ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు.