AP: కర్నూలు జిల్లా పత్తికొండలో పోలీసులు, లాయర్ల మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో చేతులకు బేడీలు వేసుకుని న్యాయవాదులు నిరసన తెలిపారు. కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన శివయ్య అనే వ్యక్తిపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని న్యాయవాదులు ఆరోపించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.