విశాఖ: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విశాఖ-చర్లపల్లి ప్రత్యేక ఎక్స్ప్రెస్ జనవరి 10-19 మధ్య శని, సోమవారాల్లో సాయంత్రం 5:30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:15కి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (08512) జనవరి 11-20 మధ్య ఆది, మంగళవారాల్లో మధ్యాహ్నం 3:30కి బయలుదే రుతుంది.