E.G: రాజమండ్రిలోని 9వ డివిజన్ ఏవీ అప్పారావు రోడ్డులో రూ. 65 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాజమండ్రి MLA ఆదిరెడ్డి వాసు శ్రీకారం చుట్టారు. ఆ పరిసరాల్లోని డ్రైనేజీలపై స్లాబ్లు వేసేందుకు తదితర అభివృద్ధి పనుల నిమిత్తం ఆదివారం పనులు ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9వ డివిజన్లోనే సుమారు రూ. 12 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.