KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని వారు ఆధార్ కార్డుతో సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సోమవారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. నమోదు అనంతరం రసీదు లేదా సీరియల్ నంబర్ తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ సబ్సిడీ సోలార్ ప్యానల్‌కు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు విద్యుత్ అధికారులను సంప్రదించాలని చెప్పారు.