SRCL: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ అభినందనీయమని, వేములవాడ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు.