ASR: హుకుంపేట మండలం ములియపుట్టు పంచాయతీ మెట్టు మామిడిలో రహదారి లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఎన్హెచ్ 516E పక్కనే ఉన్నా, వర్షం వస్తే గ్రామంలోకి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. అత్యవసర సేవలకు కూడా ఇబ్బందిగా మారిందని, అధికారులు స్పందించి వెంటనే సీసీ రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.