SKLM: వైకుంఠ ఏకాదశి రోజుభక్తులు దర్శనాలకు ఎటువంటి అసౌకర్యం కలగరాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రముఖ వైష్ణవాలయాలు వెంకటేశ్వర ఆలయాల వద్ద ముందు జాగ్రత్త చర్యగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉత్తర ద్వారం దర్శనాలు సాఫీగా సులభతరంగా జరిగేటట్లు చేయాలన్నారు.