MDK: పొలానికి వెళ్ళిన ఒక రైతు కనిపించకుండా పోయిన ఘటన చేగుంట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన సంగు శ్రీశైలం (32) ఈనెల 27న పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇంటి వద్ద పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు.