BPT: అమృతలూరు మండలం మూల్పూరు వద్ద సోమవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ, వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరమ్మతో పాటు మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా పెరవలిపాలెం నుండి మొక్కజొన్న పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.