VZM: జిల్లాలో పోక్సో కేసులు గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు SP దామోదర్ తెలిపారు. 2024లో 58 కేసులు నమోదుకాగా.. 2025లో 57 కేసులు నమోదయ్యాయని, ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడంతో నిందితులకు కఠిన శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, 2 కేసుల్లో 25 సంవత్సరాలకు పైగా, 11 కేసుల్లో 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడిందన్నారు.