KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు డీఐజీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం, త్వరలోనే కొత్త పోస్టింగ్ ఇవ్వనుంది. విక్రాంత్ పాటిల్ పదోన్నతి పొందడం పట్ల జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.