BDK: భద్రాచల సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ అధ్యయనోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన సోమవారం రామయ్య శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు సాయంత్రం గోదావరి నదిలో స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహించే ‘తెప్పోత్సవం’ కోసం యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.