కృష్ణా: ఆత్కూరు పోలీసులు రూ. 90 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఆత్కూరులో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పెద్ద అవుటపల్లి ఈశాన్య గార్డెన్స్‌లోని ఖాళీ ప్లాట్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.