MBNR: కళాశాల విద్యార్థినులను వేధించిన 18 మంది యువకులకు షీ టీం బృందం శనివారం కౌన్సిలింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. మైనర్లను వేధించడం చట్టరీత్యా నేరమని, కేసులు నమోదైతే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. ఆకతాయి పనులకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువకులకు సూచించారు.