WGL: పర్వతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి వివాహమై కూతురు ఉన్న విషయం దాచి మోసం చేసిన ఘటనలో మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని బాధితులు ఇవాళ డిమాండ్ చేశారు. బ్యూరోకు ముందే విషయం తెలిసిన తమకు చెప్పలేదని.. బ్యూరో రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తోందని ఆరోపించారు. ఇతరులు మోసపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.