KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో మహిళలపై 567 కేసులు నమోదయ్యాయి. ఇందులో వరకట్న హత్యలు, మరణాలు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపులు, అత్యాచారం, అపహరణ, లైంగిక వేధింపులు, బహుభార్యత్వం కేసులు ఉన్నాయి. 2024లో 598 కేసులు నమోదు కాగా గత సంవత్సరం కంటే 5.18% మహిళల కేసులు తగ్గాయని సీపీ గౌస్ ఆలం తెలిపారు.