మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మర్లు విగ్నేశ్వర కాలనీలో కాలనీ అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి బాలస్వామి పాల్గొన్నారు.