SRPT: నడిగూడెం మండలం కరివిరాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ మారోజు పార్వతమ్మ అన్నారు. ఇవాళ ఉదయం కరివిరాల గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా విస్తరించిన కంపచెట్లు, పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో తొలగించే పనులను ఆమె స్వయంగా పర్యవేక్షించారు.