AP: అమరావతిలోని మందడంలో రైతు రాములు మృతి చెందడంపై APCRDA సంతాపం తెలిపింది. ‘N8 రహదారి అంశంపై గ్రామసభలో రాములు పాల్గొన్నారు. ఆయన స్వచ్ఛందంగా 1.60 ఎకరాల భూమి ఇచ్చారు. 3 ప్లాట్లు, ఒక వాణిజ్య ప్లాట్ రిజిస్ట్రేషన్ చేశాం. వాగులో ప్లాట్ ఇచ్చారన్న ప్రచారం కూడా అవాస్తవం. అనారోగ్యంతోనే రాములు మృతిచెందారు’ అని APCRDA పేర్కొంది.