AP: గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. విజయవాడ, తిరుపతి గ్రేటర్ హోదాకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి నారాయణ చెప్పారు. జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయకూడదని కేంద్రం ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఈ ప్రక్రియ వాయిదా వేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.