‘బాహుబలి: ది ఎపిక్’ రీరిలీజ్ భారీ విజయం సాధించడంతో రాజమౌళి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఈగ’ను కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను భారీ స్థాయిలో రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.