కోనసీమ: రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో 10వ రాష్ట్రస్థాయి దండు సాయి ఆకాష్ వర్మ మెమోరియల్ నెట్ బాల్ పోటీలను శనివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి జెండా వందనం నిర్వహించారు. అనంతరం సాయి ఆకాష్ వర్మ ఆత్మశాంతికి మౌనం పాటించారు. అనంతరం మైదానంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. క్రీడాకారులు గౌరవవందనాన్ని చేశారు.