TG: కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. KCR కాలు బయటపెట్టగానే ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. తెలంగాణ తెచ్చిన నాయకుడికి శాపనార్థాలు పెడుతున్నారని తెలిపారు. రేవంత్‌కు ఒకే భాష వచ్చని.. తనకు నాలుగు భాషలొచ్చని వ్యాఖ్యానించారు. తాను గుంటూరులో చదువుకుంటే తప్పైతే.. రేవంత్ భీమవరం నుంచి అల్లుడ్ని తెచ్చుకున్నారు కదా అని నిలదీశారు.