ఆడవాళ్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు నిర్మాత SKN కౌంటర్ ఇచ్చాడు. అమ్మాయిలు తమకు నచ్చిన బట్టలు ధరించి కంఫర్ట్‌గా ఉండాలని ఆయన పేర్కొన్నాడు. ‘ఏ బట్టల సత్తి మాటలు వినకండి’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే అంతా మంచే జరుగుతుందని, బట్టల్లో ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశాడు.