తాను చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషనర్ వివరణ అడిగారని నటుడు శివాజీ తెలిపారు. తన కామెంట్స్‌పై ఇప్పటికే క్షమాపణలు అడిగానని గుర్తు చేశారు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టాలని తాను మాట్లాడలేదన్నారు. జరిగిన సంఘటనలు చూసిన బాధతోనే ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కొంతమందికి తనపై వ్యతిరేకత ఉందని.. అందుకే తనపై కుట్ర చేశారని ఆరోపించారు.