బాలీవుడ్ ‘కండలవీరుడు’ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఈ బర్త్ డే పార్టీలో దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి పాల్గొని సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్, ధోనీలను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు SM వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.