టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అరుదైన రికార్డు సాధించాడు. 2025 క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది గిల్ 7 సెంచరీలతో 1,764 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్(1,760) రెండో స్థానంలో, ఇంగ్లండ్ ప్లేయర్ జోరూట్(1,598) మూడో స్థానంలో నిలిచాడు.