AP: రాష్ట్రంలో రూ.13.7 కోట్ల ట్రైకార్ నిధులను మంత్రి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం నేతృత్వంలో ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ నిధులతో లబ్ధిదారులకు వ్యవసాయ జీవనోపాధి పరికరాలు పంపిణీ చేశామని తెలిపారు. ITDA ద్వారా 90 శాతం సబ్సిడీతో పరికరాలను అందించినట్లు చెప్పారు.