KNR: జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించేలా తెలంగాణ విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహాన్నిస్తున్నామని బీసీ సంక్షేమ రాష్ట్ర, రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలో 12వ రాష్ట్రఁస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.