KRNL: పెద్దకడబూరు(మం) చిన్నతుంబళంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద క్షుద్రపూజలు జరిగాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని శనివారం సొసైటీ ఛైర్మన్ కే. నరసప్ప ఎస్సై నిరంజన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈనెల 25న గుర్తుతెలియని వ్యక్తులు రెండు చోట్ల తాయత్తులు కట్టి భయాందోళనలకు గురిచేశారని ఆయన పేర్కొన్నారు. విచారణ జరిపి దోషులను శిక్షించాలని వారు కోరారు.