NZB: బోధన్ మండలం నాగన్పల్లిలో నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై కేజ్వీల్ ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పొలం పనుల కోసం ఇనుప చక్రాలతో తారు రోడ్లపైకి రావడంతో రహదారులు ధ్వంసమై గుంతలమయంగా మారుతున్నాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న రోడ్లు కొందరి నిర్లక్ష్యం వల్ల పాడవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.