MBNR: దేవరకద్ర మండలం ఏదులాపురం BRS గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు అంజన్నగౌడ్, ఆ పార్టీకి చెందిన మరికొందరు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తూ, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందే విధంగా కృషిచేయాలని సూచించారు.