SRPT: పోలీస్ చలాన్, RTA చలాన్, ప్రభుత్వ పథకాలు పేరుతో వాట్సప్, సోషల్ మీడియాలో వస్తున్న APK ఫైళ్లను డౌన్లోడ్ చేయోద్దని SP నరసింహ సూచించారు. ఈ ఫైళ్ల ద్వారా మొబైల్ హ్యాక్ అయి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించే ప్రమాదం ఉందన్నారు. అధికారిక యాప్లు, వెబ్సైట్లు మాత్రమే వినియోగించాలని ఎస్పీ తెలిపారు.