AP: పార్వతీపురం జిల్లా చింతలబెలగాంలో అమానుష ఘటన జరిగింది. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తీసి మరో చోట పూడ్చిపెట్టిన ఘటన సంచలనంగా మారింది. శ్మశానం లేకపోవడంతో దళిత కుటుంబం మృతదేహాన్ని రోడ్డుపక్కన పూడ్చిపెట్టింది. మృతదేహం పూడ్చిన స్థలం రైతు ఆధీనంలో ఉండటంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రికి రాత్రి మృతదేహాన్ని వెలికితీసి 3 అడుగుల దూరంలో పూడ్చారు.