MNCL: డిజిటల్ తరగతులతో విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవుతాయని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పర్వీన్ సుల్తానా అన్నారు. దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్‌ను శనివారం ప్రారంభించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గిరిధర్ ఉపాధ్యాయులు ఉన్నారు.