BDK: అశ్వాపురం, మణుగూరు, కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడ డివైడర్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో సర్పంచ్ బానోత్ సదర్, ఉప సర్పంచ్ ప్రకాష్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ పనులు పూర్తికాక దుమ్ము దూలీలతో ప్రయాణికులు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు.