వర్క్‌కు టైం అవుతోంది.. ఇప్పుడు తినడం కుదరదని ఆహారాన్ని స్కిప్ చేస్తున్నారా?. మీరెంత బిజీగా ఉన్నా.. సమయానికి భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినకుండా ఎక్కువ సేపు ఉంటే మీ రక్తంలో చక్కెర తగ్గుతుంది. దీంతో మీ శరీరం కార్టిసాల్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని వల్ల ఒత్తిడి, కోపం పెరుగుతాయి.