MHBD: ఓకే వేదికపై మూడు ప్రధాన పార్టీల రాజకీయ ప్రముఖులు కనిపించిన దృశ్యం ఆవిష్కృతం అయింది. శనివారం మాజీ మంత్రి రామచంద్రరెడ్డి విగ్రహావిష్కరణలో ఈ దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ నుంచి మంత్రి పొంగులేటి, MLAలు రాంచందర్, మురళినాయక్, ఎంపీ బలరాంనాయక్ పాల్గొన్నారు. అలాగే BRS నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్, MLC రవీందర్, BJP నుంచి పలువురు నేతలు పాల్గొన్నారు.