పల్లె కథ, సామాజిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దండోరా’ సినిమా మంచి విజయం అందుకుంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ ఏడాదిలో హైయెస్ట్ రేటెడ్ మూవీగా ఇది నిలిచింది. IMDbలో 9.9/10.. బుక్ మై షోలో 9.5/10 రేట్లతో టాప్లో ఉంది. ఇక ఈ సినిమాలో శివాజీ, నవదీప్, బిందు మాధవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.