BHNG: బీబీనగర్ పోచంపల్లి రోడ్డులో సమయానికి బస్సులు నడపాలని యాదగిరిగుట్ట డిపో అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ రెడ్డికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆ రూట్లో ఉన్న పలు గ్రామాల విద్యార్థులు సమయానికి బస్సులు రాక పాఠశాలకు, కళాశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.